‘పచ్చ’కుట్రలు తిప్పికొడదాం | - | Sakshi
Sakshi News home page

‘పచ్చ’కుట్రలు తిప్పికొడదాం

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

ధర్మవరం: మున్సిపల్‌ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ‘పచ్చ’నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొడదామని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఎల్‌ఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికలలో బీఎల్‌ఏల పాత్ర చాలా కీలకమన్నారు. పోలింగ్‌ కేంద్రంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఓటుకు పింక్‌ కలర్‌ బ్యాలెట్‌ పేపర్‌, కౌన్సిలర్‌కు వైట్‌ కలర్‌ బ్యాలెట్‌ పేపర్లు అందుబాటులో ఉంటాయని, ఆరెండింటినీ ఒకే బ్యాలెట్‌ బాక్స్‌లో వేయాల్సి ఉంటుందన్నారు. బీఎల్‌ఏలు ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అలాగే పోలింగ్‌ కేంద్రంలో అరాచక శక్తులు రిగ్గింగ్‌ యత్నించినా, సైక్లింగ్‌ చేయాలని చూసినా బీఎల్‌ఏలు వెంటనే పోలింగ్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. పోలింగ్‌ ఆఫీసర్‌ పట్టించుకోకపోతే ఈసీకి ఫిర్యాదు చేస్తామని, అప్పుడు సదరు పోలింగ్‌ ఆఫీసర్‌ ఉద్యోగం ఊడటం ఖాయమన్నారు. కూటమి నాయకులు దౌర్జన్యాలకు పాల్పడితే ధైర్యంగా ఎదుర్కోవాలని, ప్రతి ఒక్కరికి కేతిరెడ్డి అండగా ఉంటారని భరోసానిచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే కార్యకర్తలు, పోలింగ్‌ ఏజెంట్లకు సముచిత స్థానం దక్కేలా చూస్తామన్నారు. అందరూ సమష్టిగా పని చేయాలన్నారు. సమావేశంలో పట్టణంలోని 48వార్డుల వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే

కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పిలుపు

ప్రతి బీఎల్‌ఏకు తాను అండగా

ఉంటానని భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement