ఓటమి భయంతోనే ప్రచారానికి బాలకృష్ణ | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే ప్రచారానికి బాలకృష్ణ

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

హిందూపురంలో రెండున్నరేళ్లుగా అరాచకశక్తులు రాజ్యమేలుతున్నాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో ఉండగానే వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడి చేశారు. ప్రజాస్వామ్యంలో ఇంత దౌర్జన్యం ఎక్కడైనా ఉంటుందా..? అక్రమ మైనింగ్‌, ఇసుక, మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. అభివృద్ధి మాటున టీడీపీ నేతలు జేబులు నింపుకున్నారు. టీడీపీ నేతలకు ఓట్లు అడిగే అర్హతే లేదు. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని టీడీపీ ఎన్నికల్లో ఓటమి చెందడం ఖాయం. అందుకే సినిమాలకే పరిమితమైన ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారానికి వస్తున్నారు.

– టీఎన్‌ దీపిక, వైఎస్సార్‌సీపీ

నియోజకవర్గ సమన్వయకర్త, హిందూపురం

తాగునీటికీ కరువు

మా ప్రాంతంలో పది రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి. రోజువారీ అవసరాలకు ఆ నీళ్లు సరిపోవడం లేదు. అందుకే ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొంటున్నాం. డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో దోమలు వ్యాప్తి అధికంగా ఉంది. వర్షాలు పడితే మరింత ఇబ్బందికరంగా ఉంటుంది.

– శారద, హిందూపురం

రోడ్లపైనే మురుగు

హిందూపురం మున్సిపాలిటీని అధ్వానంగా మార్చారు. అభివృద్ధి పనుల పేరుతో దోచుకుతిన్నారు. డ్రైన్లు లేక మురుగునీరు రోడ్లుపైనే ప్రవహిస్తోంది. మున్సిపల్‌ వర్కర్లు కొరత ఎక్కువగా ఉంది. ఉన్నవారితోనే ఎక్కువ పని చేయిస్తున్నారు. వర్షాలు వస్తే ఇళ్లలోకి, దుకాణాల్లోకి నీరు చేరుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

– సురేష్‌ కుమార్‌,

రైల్వే రోడ్డు, హిందూపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement