ఓటమి భయంతోనే అరాచకాలు | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే అరాచకాలు

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

● టీడీపీ దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొందాం

● పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుడు

రమేష్‌రెడ్డి పిలుపు

మడకశిర: ప్రజల మద్దతు కోల్పోయిన టీడీపీ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని, అందువల్లే దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతూ అరాచకాలు చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ హిందూపురం పార్లమెంట్‌ పరిశీలకుడు రమేష్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు వైసీ గోవర్దన్‌రెడ్డిలతో కలిసి మడకశిరలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా ప్రజలకు వారు చేసిందేమీ లేదన్నారు. ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. చంద్రబాబుకు నిజంగా ధైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా జరిపించాలని సవాల్‌ చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యాలు, దుర్మార్గాలను ధైర్యంగా ఎదుర్కొందామని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఏ ఒక్క కార్యకర్తకు ఇబ్బంది కలిగినా ఊరుకోబోమన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా పని చేయాలని కోరారు. సమావేశంలో మడకశిర నగర పంచాయతీ చైర్మన్‌ అభ్యర్థి ఓంకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement