పావగడ: కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు తాలూకాలోని కణివేనహళ్లికి చెందిన నరసింహమూర్తి(40) కారును అద్దెకు తిప్పుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈక్రమంలో కారులో తుమకూరు వైపు వెళ్తుండగా పట్టణ సమీపంలోని నయారా పెట్రోల్ బంక్ ఎదుట ప్రధాన రోడ్డుపై డివైడర్‌ను ఢీకొంది. ఘటనలో తీవ్రగాయాల పాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కారు ముందు భాగంగా దెబ్బతినింది. భర్త మరణ వార్త విని తట్టుకోలేక భార్య అంకిత తీవ్రంగా రోదించింది. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
వృద్ధుడి దుర్మరణం
ఓడీచెరువు: పాలినేనివారిపల్లి వద్ద జరిగిన గురువారం రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు..ముత్యాలచెరువుకు చెందిన ఆంజనేయులు (60) చెర్లోపల్లి డ్యాం చేపలు అమ్ముకుని స్వగ్రామానికి టీవీఎస్ వాహనంపై బయలుదేరాడు. ఈక్రమంలో పాలినేనివారిపల్లి వద్ద మరో టీవీఎస్ పరస్పరం ఢీకొన్నాయి. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


