ఇక్కడ ఎన్నికల కోడ్‌ వర్తించదు! | - | Sakshi
Sakshi News home page

ఇక్కడ ఎన్నికల కోడ్‌ వర్తించదు!

Oct 23 2026 1:39 AM | Updated on Oct 23 2026 1:39 AM

అనంతపురం న్యూ టౌన్‌: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నియమావళి ప్రకారం ఒక అభ్యర్థి తన నామినేషన్‌ దాఖలు చేయాలంటే తనతో పాటు మరో ఇద్దరు ప్రతిపాదకులు మాత్రమే వెంట వెళ్లాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ఇలాకాలో అలాంటి నిబంధనలు వర్తించడం లేదు. వివరాల్లోకెళితే.. ఉరవకొండ ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం చిన్న ముష్టూరు ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి నవనీత పదుల సంఖ్యలో నాయకులతో కలిసి నామినేషన్‌ వేశారు. పోలీసులు గాని అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి గాని రిటర్నింగ్‌ అధికారి గానీ వారిని నిలువరించకపోవడం గమనార్హం. అదే సమయంలో వైఎస్సార్‌సీపీతోపాటు ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసే సమయంలో వారి వెంట కనీసం ఇద్దరు వెళ్లేందుకు అనుమతులు ఉన్నా సవాలక్ష ప్రశ్నలు ఎదుర్కొనాల్సి రావడం అధికారుల ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆరోపణలు వినపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement