పుట్టపర్తి: జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి రెండో రోజూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. గురువారం జిల్లాలోని 32 జెడ్పీటీసీ స్థానాలకు ఆయా పార్టీల నుంచి 117 నామినేషన్లు దాఖలైనట్లు జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున 60, టీడీపీ 38, జనసేన 8, కాంగ్రెస్ 13, బీజేపీ 7, బీఎస్పీ 2, ఇండిపెండెంట్లు 8 కలిపి మొత్తం 136 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. తలుపుల, తనకల్లు మండలాల్లో మాత్రమే ఒక్కోటి దాఖలు కాగా అత్యధికంగా గాండ్లపెంటలో 10 నామినేషన్లు వచ్చాయని తెలిపారు. శుక్రవారం చివరి రోజు కావడంతో మరిన్ని నామినేషన్లు రావొచ్చని ఆయన పేర్కొన్నారు. నామినేషన్ ప్రక్రియను జేసీ మౌర్య భరద్వాజ్ పర్యవేక్షించారు.
కొనసాగిన
నామినేషన్ల ప్రక్రియ
అనంతపురం న్యూ టౌన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండో రోజూ గురువారం కొనసాగింది. గురువారం జిల్లాలోని 31 జెడ్పీటీసీ స్థానాలకు 92 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో వైఎస్సార్‌సీపీ తరఫున మొత్తం 41 మంది నామినేషన్లు వేశారు. ఇక జిల్లాలోని 450 ఎంపీటీసీ స్థానాలకుగాను రెండు రోజులుగా 1,199 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇందులో 237 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులున్నారు. అయితే రాప్తాడు, తాడిపత్రి ఆత్మకూరు మండలాల్లో టీడీపీ నేతల అరాచకంగా కారణంగా ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ల దాఖలు కాలేదు.
విమల స్మారక పురస్కారాల విజేతలు వీరే..
అనంతపురం కల్చరల్: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా అందించే ‘విమల స్మారకశాంతి కథా పురస్కారాల విజేతలను డాక్టర్ శాంతి నారాయణ గురువారం వెల్లడించారు. ‘ఇల్లిడిసిన తొమ్మిది కథలు’ రాసిన మారుతీ పౌరోహితం, స్వర్ణకిలారి రచించిన ‘గోడవతల’ కథా సంపుటాలు ఈ ఏడాది విమలా స్మారక పురస్కారాలకు ఎంపిక చేశామన్నారు. వీరందరికీ త్వరలో నగదు పురస్కారంతో పాటు ఘనంగా సత్కరించనున్నట్లు శాంతినారాయణ పేర్కొన్నారు.


