పెనుకొండ రూరల్: సోమందేపల్లి మండలానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్ నాయకులు ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ సత్యసాయిజిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ నేతృత్వంలో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. సోమందేపల్లికి చెందిన రాప్తాడు సూరి, నీరుగంటి నరసింహమూర్తి, రాజన్న గారి ఆంజనేయులు, మంచేపల్లి ఆదినారాయణ రెడ్డిలకు అధినేత వైఎస్ జగన్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.


