చిలమత్తూరు: పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలు అని వైఎస్సార్‌సీపీ హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపిక పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు, పార్టీ నాయకులను బెదిరించడానికి అధికార పార్టీ నాయకులు కేసులు తెరమీదకు తెస్తారని, బైండోవర్ల పేరుతో వేధిస్తారని, అన్నింటికీ సిద్ధంగా ఉండాలన్నారు. మండలంలోని మరవకొత్తపల్లి సమీపంలోని విరాట్ ప్యాలెస్‌లో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే ప్రధాన బలం అని, కార్యకర్తల తర్వాతే నాయకులు అని ఆమె స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను కార్యకర్తలతో కలిసి ఏకాభిప్రాయంతో నిలబెడతామన్నారు. టీడీపీ చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలతో వైఎస్సార్‌సీపీ శ్రేణులకే కాదు, సామాన్య ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకులు జనార్దన్‌రెడ్డి, సురేష్‌కుమార్‌రెడ్డి, అన్సర్ అహ్మద్ మాట్లాడుతూ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలిసి కట్టుగా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం పంచాయతీ కమిటీ అధ్యక్షులకు పార్టీ గుర్తింపు కార్డులను సమన్వయకర్త దీపిక పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ముఖ్యనేత వేణురెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వీఎస్ పురుషోత్తమరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, జోన్ 5 బూత్ లెవెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్‌కుమార్‌రెడ్డి, కురుబ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్‌ఏ శివ,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రామ్మూర్తి, మైనార్టీ వింగ్ రాష్ట్ర కార్యదర్శి అన్సార్ అహ్మద్,జిల్లా కార్యదర్శి గిరిధర్‌రాజు, రజక విభాగం జిల్లా అధ్యక్షుడు రమేష్, సోషల్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణురెడ్డి, పంచాయతీరాజ్ నియోజకవర్గ అధ్యక్షుడు కులశేఖర్‌రెడ్డి, మండల కోకన్వీనర్ రంగారెడ్డి, మాజీ మండల కన్వీనర్ మద్దిపి లక్ష్మీనారాయణ, మాజీ సింగిల్ విండో అద్యక్షుడు అమరనాథ్, మాజీ సర్పంచ్‌లు శంకర్‌రెడ్డి, సంధ్య, లక్ష్మీపతిరెడ్డి, జబీఉల్లా, మాజీ ఎంపీటీసీలు రాఘవేంద్రరెడ్డి, లక్ష్మిరెడ్డి, మంజునాథ్‌రెడ్డి, ఆదినారాయణ, షాకీర్, హరి, నాయకులు అశ్వర్థరెడ్డి, దామోదర్‌రెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, గిరీష్‌రెడ్డి, దివాకర్‌రెడ్డి, చిన్నప్పయ్య, ఫారూఖ్, అయూబ్, రామచంద్రారెడ్డి, అంజన్‌రెడ్డి, రామచంద్ర, నాగేంద్రరెడ్డి, వెంకటప్ప,మహేంద్రరెడ్డి, గజేంద్రరెడ్డి, వెంకటరెడ్డి, శంకర్‌రెడ్డి, ఆదర్శరెడ్డి, నాగభూషణరెడ్డి, నంజిరెడ్డి, నవీష్‌రెడ్డి, ధనురెడ్డి, అశ్వర్థప్ప, శ్రీనాథ్‌రెడ్డి, శివారెడ్డి, లక్ష్మీపతిరెడ్డి, అశోక్‌రెడ్డి, రంగప్ప, శేషాద్రిరెడ్డి, సురేంద్రరెడ్డి , చంద్రశేఖర్‌రెడ్డి, రామిరెడ్డి, ఆదిరెడ్డి, బాబురెడ్డి, నయిముల్లా, రంగారెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి
సమావేశంలో టీఎన్ దీపిక
వాళ్లను వదలం
పార్టీ కార్యకర్తల జోలికొచ్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నేత వేణురెడ్డి హెచ్చరించారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దాడులు చేస్తూ.. అక్రమ కేసులు బనాయించి వేధించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై బదులు తీర్చుకుంటామన్నారు. అధికార మదంతో టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటన తనను కలచివేసిందన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం గుర్తుపెట్టుకోకుండా టీడీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వారికి బుద్ధి చెప్పి తీరుతామన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పార్టీని గెలిపించుకోవడానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.


