మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం హృదయం.. అయితే అవయవ ఆరోగ్యంపై అశ్రద్ధతోనే హృదయం ఒత్తిడి, వేదనకు గురవుతోంది.. అవయవ ఆరోగ్యంపై చాలామంది అశ్రద్ధ వహిస్తుంటారు. ఫలితంగా గుండెపోటు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా గుండెజబ్బులు చోటు చేసుకుంటు | - | Sakshi
Sakshi News home page

మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం హృదయం.. అయితే అవయవ ఆరోగ్యంపై అశ్రద్ధతోనే హృదయం ఒత్తిడి, వేదనకు గురవుతోంది.. అవయవ ఆరోగ్యంపై చాలామంది అశ్రద్ధ వహిస్తుంటారు. ఫలితంగా గుండెపోటు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా గుండెజబ్బులు చోటు చేసుకుంటు

Sep 29 2026 1:03 AM | Updated on Sep 29 2026 1:03 AM

● పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రాజశేఖర్‌రెడ్డి (40) ఈ ఏడాది ఆగస్టు 31న గుండెపోటుతో మరణించారు. హైదరాబాదులో ఆఫీసుకు వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో గుండెపోటు రావడంతో ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన చిన్న వయసులోనే గుండెపోటుకు గురై ప్రాణాలు వదలడం ఆ కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టింది.

● గుమ్మఘట్ట మండలం భూతయ్యనగర్‌కు చెందిన గొడ్లయ్య(40) ఈ ఏడాది ఆగస్టు 14న గుండెపోటుతో చనిపోయారు. రాజకీయాల్లో ఉంటూ నిత్యం చలాకీగా తిరిగే గొడ్లప్ప చిన్నవయసులోనే గుండెపోటుకు గురై చనిపోవడం గ్రామస్తులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

..వీరిద్దరే కాదు.. చిన్నవయసులోనే గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. చలాకీగా తిరుగుతూ..పైకి బాగా కన్పించేవారు సైతం ఉన్నట్టుండి గుండెపోటుకు గురవుతున్నారు. జీవనశైలి మార్పులు, సరైన అవగాహనతోనే ఇలాంటి పరిస్థితిని అధిగమించవచ్చునని వైద్యనిపుణులు చెబుతున్నారు.

అనంతపురం సిటీ: ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా గతేడాది నుంచి గుండెపోటు మరణాలు ఎక్కువైనట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు వయస్సు పైబడిన వారిలో మాత్రమే కనిపించే గుండెపోటు... ప్రస్తుతం చిరు ప్రాయంలో ఉన్న వారిలోనూ బహిర్గతమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మానసిక ఒత్తిడి, మద్యపానం, మారిన ఆహారపు అలవాట్లే ఇందుకు కారణంగా వైద్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాక కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత ఈ కేసుల సంఖ్య పెరిగినట్లు పేర్కొంటున్నారు.

పెరుగుతున్న బాధితులు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారి సంఖ్య క్రమేణా పెరుగుతున్నట్లు ఇటీవలి అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 25 శాతం మంది పురుషులు, 15 శాతం మంది మహిళలు గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ చికిత్స పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య 17 శాతం అధికంగా ఉన్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

మారిన అలవాట్లతో ముప్పు

ఆధునిక సాంకేతికత పెరిగిన ప్రస్తుత రోజుల్లో శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. యాంత్రిక జీవనానికి అలవాటు పడడంతో ప్రతి ఒక్కరిలోనూ మానసిక ఒత్తిళ్లు అధికమయ్యాయి. పట్టుమని 15 ఏళ్లు కూడా దాటకుండానే బీపీ, షుగర్‌, ఊబకాయం వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే శారీరకంగా ఎంతో ఫిట్‌గా ఉన్న వారు కూడా గుండెపోటు బారిన పడుతుండడం మరింత ఆందోళనకరం. దీంతో గుండె పనితీరు తెలుసుకునేందుకు ఏడాదికి ఒక్కసారైన వైద్య నిపుణులను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

అవయవ ఆరోగ్యంపై అశ్రద్ధతోనే

హృదయ వేదన

వయసుతో నిమిత్తం లేకుండా గుండెజబ్బులు

పెరుగుతున్న గుండె సంబంధిత రోగుల సంఖ్య

ముప్పు ముంచుకొచ్చేవరకూ ఉండొద్దంటున్న కార్డియాలజిస్టులు

సందర్భం

నేడు ప్రపంచ

గుండె దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement