అంగన్‌వాడీలకు మేనేజ్‌మెంట్‌ కమిటీలు అవసరం | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలకు మేనేజ్‌మెంట్‌ కమిటీలు అవసరం

Sep 29 2026 1:03 AM | Updated on Sep 29 2026 1:03 AM

పుట్టపర్తి అర్బన్‌: ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి మేనేజ్‌మెంట్‌ కమిటీలు అవసరమని ఐసీడీఎస్‌ పీడీ ప్రమీళ, బీజేపీ జాతీయ ఆల్‌సెల్స్‌ కో కన్వీనర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అంగన్‌వాడీ మేనేజ్‌మెంట్‌ కమిటీ కృషి చేస్తుందన్నారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంతిగ్రామం అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్‌వాడీ ఉత్సవాల్లో భాగంగా విశేష సేవలు అందించిన కార్యకర్తలు, ఆయాలను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్నారులకు ఆట పాటల విద్యతో సమగ్రాభివృద్ధికి అంగన్‌వాడీ కార్యకర్తలు పాటుపడుతున్నారన్నారు. ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మిషన్‌ వాత్సల్య కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అర్హులను గుర్తించాలన్నారు. కమిటీలో చిన్నారుల తల్లులు ఇద్దరు, ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్‌, ఆశా కార్యకర్త, ఇద్దరు ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యులు ఉంటారన్నారు. కార్యక్రమాలు ఈనెల 25 నుంచి అక్టోబర్‌ 7 వరకూ కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ రజిత, కార్యకర్తలు నర్మద, ఉమామహేశ్వరి, సులోచన, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement