అగళిని కరువు మండలంగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

అగళిని కరువు మండలంగా ప్రకటించాలి

Sep 29 2026 1:03 AM | Updated on Sep 29 2026 1:03 AM

అగళి: అగళిని కరువు మండలంగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప డిమాండ్‌ చేశారు. సోమవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ నిరసన తెలియజేశారు. ఈరలక్కప్ప మాట్లాడుతూ ప్రభుత్వం అగళి మండలంలో నెలకొన్న కరువు తీవ్రతను తీవ్రంగా పరిగణించాలన్నారు. ఎన్నడూ లేని విధంగా వర్షభావ పరిస్థితులు దాపురించాయన్నారు. ఎన్నో ఏళ్లుగా పెంచుతున్న వక్కతోటలు కూడా వందలాది ఎకరాల్లో ఎండిపోతున్నాయన్నారు. కంది, పత్తి, మిర్చి, వేరుశనగ, ఆముదం, రాగి, మొక్కజొన్న తదితర పంటలన్నీ ఇప్పటికే నాశనమయ్యాయన్నారు. కనీసం 20 శాతం దిగుబడి కూడా వచ్చే పరిస్థి లేదన్నారు. పంటలు లేక, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో 1200 అడుగల లోతుకు బోర్లు వేసినా నీరు పడక రైతులు విలవిల్లాడుతున్నారన్నారు. వేలాది కుటుంబాలు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు వలస వెళ్తున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, చిన్న సన్నకారు రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని, కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అగళిని కరువు మండలంగా ప్రకటించకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్‌ హరికుమార్‌కు వినతిపత్రం అందించారు.

కాకర్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ స్టూడియో శ్రీనివాస్‌, మాజీ సర్పంచులు శివకుమార్‌, రామకృష్ణప్ప , గ్రీవెన్స్‌ వింగ్‌ రాష్ట్ర కార్యదర్శి శివన్న, జిల్లా ఆర్గనైజర్‌ సెక్రటరీ జయకుమార్‌, నాయకులు వెంకటస్వామి, నటరాజు, సతీష్‌, శ్రీనివాస్‌, బోజే గౌడ్‌, శివన్న, తిమ్మరాయప్ప, సూర్యనారాయణ రెడ్డి, హనుమంతరాయప్ప, రంగనాథ్‌, రామచంద్రప్ప, కుమార్‌, నాగేంద్ర, శ్రీనివాస్‌, నాగేష్‌, శ్రీనావాసులు, రంగనాథ్‌, దేవరాజు, పవన్న, మైలారప్ప, రాజన్న, హరీష్‌, ఈరన్న, నంజప్ప, మంజునాథ్‌, కాంతన్న , సంజీవప్ప, హనుమంతప్ప, గురులింగ, మారన్న, రవిచంద్ర, కృష్ణ, లలిత, మారెన్న, కొండ నాగరాజు, ముడ్ల గిరియప్ప, తిమ్మరాజు, శశి, వినయ, రంగప్ప, జయరామప్ప, శివరాజు, మంజునాథ్‌, శ్రీనివాస్‌, గోవిందప్ప, కెంచప్ప, నరేష్‌, రంగనాథప్ప కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement