రాష్ట్రంపై అప్పుల భారం పెరిగినప్పటికీ, సంక్షేమం, అభివృద్ధి మాత్రం కుంటుపడింది. వర్షాలు లేక ఈ సారి రైతులు పంటల సాగుకు విరామం ఇచ్చారు. వరుసగా పంటలు నష్టపోతున్నా ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. దీంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. అప్పుల భారంతో ఇటీవలే బత్తలపల్లిలో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. రైతులకు సంక్షేమం కావాలంటే, మళ్లీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం కావాలి.
– కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త


