ఆరు నెలలుగా తిరుగుతున్నా కనికరమేదీ..? | - | Sakshi
Sakshi News home page

ఆరు నెలలుగా తిరుగుతున్నా కనికరమేదీ..?

Sep 9 2026 12:11 AM | Updated on Sep 9 2026 12:11 AM

రొద్దం: మండల పరిధిలోని నల్లూరు దళిత వాడకు చెందిన రామప్ప తన వ్యవసాయ పొలం వద్ద రేకుల షెడ్డు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే షెడ్డుకు విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేయాలని ఆరు నెలల క్రితం సింగిల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా ట్రాన్స్‌కో వారు కనికరించడం లేదు. గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరం ఉండడంతో కటిక చీకట్లో జీవనం సాగించాల్సి వస్తోందని రామప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకటి, రెండు రోజులు అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని వాపోయాడు. రాత్రి వేళ కటిక చీకట్లో పాములు, అడవి జంతువుల భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండాల్సి వస్తోందని చెప్పాడు. ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్‌ తమపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులైనా స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నాడు.

దళితుడి సమస్యపై ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement