గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి

Sep 9 2026 12:11 AM | Updated on Sep 9 2026 12:11 AM

కదిరి టౌన్‌/నల్లచెరువు/ముదిగుబ్బ: గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ సొల్ల బొజ్జిరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన స్థానిక కమిషన్‌ సభ్యులు పి.వెంకటప్ప, జి.సునీత, కె.లక్ష్మీ, కె.సాయిరాం, కె.మల్లేశ్వరరావుతో పాటు అధికారులతో కలిసి నల్లచెరువు, కదిరి ,ముదిగుబ్బ మండలాల్లో పర్యటించారు. తొలుత నల్లచెరువు మండలం బాలేపల్లి తండాలో నెలకొన్న సమస్యలపై ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా తండాలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించేందుకు నూతనంగా బోర్లు వేయించాలని, గ్రామంలో సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా హంద్రీ–నీవా కాలువ ద్వారా మండలంలోని చెరువులు నింపితే బోర్లలో నీళ్లు వచ్చి రైతులకు మేలు జరుగుతుందని తండా వాసులు వివరించారు. ఈ మేరకు ఎస్టీ కమిషన్‌కు వినతి పత్రం అందజేశారు. గిరిజనుల సమస్యపై ప్రభుత్వంతో చర్చించి ఎస్టీ కమిషన్‌ తరపున సమస్యల పరిష్కరిస్తామని బొజ్జిరెడ్డి తెలిపారు. అనంతరం స్థానిక బాలికల గురుకుల పాఠశాలను కమిషన్‌ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. తాగునీటి ఎద్దడిపై స్థానికులు మొరపెట్టుకోగా, సమస్యను తక్షణమే పరిష్కరించి నీటి వసతి పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కదిరి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గిరిజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గిరిజన విద్యాసంస్థల నిర్వహణ, మౌలిక వసతుల లేమిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కదిరిలో ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామని దర్శించుకున్నారు.

తండావాసులతో ముఖాముఖి

ముదిగుబ్బ మండలం గరుగు తండాలో గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. జాతీయ రహదారి నిర్మాణ విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి తగిన పరిహారం అందలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీరు, విద్యుత్‌ సరఫరా సరిగా లేక తీవ్ర అవస్థలు పడుతున్నామన్నారు. స్పందించిన చైర్మన్‌.. పరిహారం చెల్లింపుల ప్రక్రియ వేగవంతం చేసేలా కలెక్టరేట్‌ అధికారులతో మాట్లాడతానని, తాగునీరు, విద్యుత్‌ సమస్యలను ప్రాధాన్యతపై పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ముదిగుబ్బ ఎంపీడీఓ కార్యాలయంలో ’ఎస్టీ గ్రీవెన్స్‌ డే’ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల డివిజన్‌ స్థాయి అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్‌ రామ్‌, కదిరి ఆర్డీఓ కళావతి, ధర్మవరం ఆర్డీఓ రాంభూపాల్‌ రెడ్డి, కదిరి తహసీల్దార్‌ రెడ్డి శేఖర్‌, ముదిగుబ్బ తహసీల్దార్‌ రవినాయక్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement