మట్టి విగ్రహాలతో పర్యావరణాన్ని కాపాడుదాం | - | Sakshi
Sakshi News home page

మట్టి విగ్రహాలతో పర్యావరణాన్ని కాపాడుదాం

Sep 9 2026 12:11 AM | Updated on Sep 9 2026 12:11 AM

ప్రశాంతి నిలయం: ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన ‘‘మట్టి గణపతిని చేద్దాం...కాలుష్యాన్ని తగ్గిద్దాం’ పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల కాలుష్యం పెరుగుతుందన్నారు. పర్యావరణానికి హాని కలిగించని మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించడం ద్వారా ప్రకృతి పరిరక్షించవచ్చన్నారు. ఏఈ శశికళ తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన ఫలితాలు సాధించాలి

ప్రశాంతి నిలయం: ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల అమలులో నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌ నుంచి జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌–2026పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయా శాఖల అధికారులు పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలపై తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలకు అన్ని విధాలు ఆయా శాఖల అధికారులు సన్నద్ధం కావాలన్నారు.

కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement