రొద్దం: మండల పరిధిలోని పెద్దగువ్వలపల్లి గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో రొద్దం కొత్త ఎస్సీ కాలనీకి చెందిన నాగరత్నమ్మకు గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే గాయపడిన మహిళను ఆమె కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనంపై ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతానికి తరలించడానికి 108కు ఫోన్ చేస్తే వారు స్పందిండం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడితే చిన్నగాయాలకు 108 వాహనం పంపమని చెప్పడం ఏమిటిని ఆగ్రహించారు. వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అక్కడున్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకోవడంతో ఆఖరికి 108 వాహనాన్ని ఏర్పాటు చేసి బాధితురాలిని పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. 108 సిబ్బంది మాట్లాడుతూ ఇప్పడు చిన్న,చిన్న గాయాలకు 108 వాహనం పంపడం కుదరన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన చోటి నుంచి కాకుండా ఆస్పత్రికి తీసుకొచ్చి గొడవ చేస్తే అర్థం లేదన్నారు.
108 సిబ్బంది స్పందించక పోవడంపై గ్రామస్తుల ఆగ్రహం


