సాక్షి, పుట్టపర్తి
పురపాలక పీఠం చాలా ఖరీదు కానుంది. మారిన ఎన్నిక విధానంలో రూ.కోట్లుంటే తప్ప సీటు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో అత్యధిక కౌన్సిల్ సీట్లు గెలిచిన పార్టీ చైర్మన్‌గా ఒకరిని ఎంపిక చేసేది. ఈ క్రమంలో సామాన్యులెందరో చైర్మన్లుగా అవకాశాలు దక్కించుకున్నారు. కానీ తాజాగా మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో చైర్మన్ సీటు హాట్‌గా మారింది. డబ్బుమూటలుంటే తప్ప కౌన్సిలర్ సీటు కూడా ఇవ్వని కూటమి పార్టీలు... చైర్మన్ సీటును ఎంతకు బేరం పెడతాయో ఆలోచించుకోవచ్చు. ఇప్పటికే ఆ విషయం తెలుసుకున్న కొందరు బడాబాబులు ఎమ్మెల్యేల వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీ ఫండ్ కింద కొంత.. ఎన్నికల కోసం ఇంకొంత కలిపి రూ.కోట్లలో ఖర్చు చేసే సామర్థ్యం ఉందని.. తమకే చైర్మన్ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే రిజర్వేషన్ ఖరారయ్యే వరకూ ఎవరికీ హామీ ఇవ్వలేమంటూ పెద్దలు మాట దాట వేస్తున్నారు. దీంతో ఆశావహుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది.
ధనమూ... బలమూ ఉంటేనే చైర్మన్..
గతంలో మున్సిపాలిటీలో ఉన్న స్థానాల్లో సగం కంటే ఎక్కువ గెలిచిన పార్టీ వ్యక్తి చైర్మన్ అయ్యేవారు. గెలిచిన వారిలో ఎవరో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకునే వారు. కౌన్సిలర్‌గా గెలిచి.. చైర్మన్ పీఠం అధిరోహించే అవకాశం ఉండేది. ఒక వార్డులో ఖర్చు భరించి.. పార్టీలో చెలామణి అవుతూ.. పెద్దల ఆశీర్వాదం ఉంటే చైర్మన్ పీఠంపై కూర్చునే అవకాశం ఉండేది. ఒక్కోసారి రిజర్వేషన్ కలిసి వచ్చి పదవులు పొందిన వారూ ఉన్నారు. అయితే ఇక నుంచి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ప్రస్తుతం చైర్మన్ కోసం ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించనున్నారు. దీంతో మున్సిపాలిటీలోని అన్ని వార్డుల ఓటర్ల ఆశీర్వాదం అవసరం. చైర్మన్ కుర్చీ కావాలంటే కనిష్టంగా రూ.కోటి పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతో సామాన్యులకు ఇక నుంచి చైర్మన్ పీఠం కలగానే మిగిలిపోనుంది. కేవలం బడాబాబులే చైర్మన్ కోసం పోటీ చేసి.. కుర్చీ దక్కించుకుంటారు.
పెరిగిన సీట్లతో అధిక భారం..
గతంతో పోలిస్తే ప్రతి మున్సిపాలిటీలో కౌన్సిల్ స్థానాల పెరిగింది. పెనుకొండలో 3, మడకశిరలో 3, పుట్టపర్తిలో 8, ధర్మవరంలో 8, కదిరిలో 8, హిందూపురంలో 14 స్థానాలు పెరగనున్నాయి. గతంలో ఏదో ఒక స్థానం నుంచి గెలిచి పార్టీ ఆశీస్సులతో చైర్మన్ అయ్యే వారు. కానీ మారిన పరిస్థితుల్లో అన్ని కౌన్సిల్ స్థానాల అభ్యర్థుల ద్వారా ప్రజల ఓట్లు రాబట్టాల్సిన పరిస్థితి. ఇందుకోసం భారీగా వెచ్చించాల్సి ఉంటుంది. ఫలితంగా ఖర్చు రూ.లక్షల నుంచి రూ.కోట్లకు చేరింది. దీంతో సంపన్నులకు భారీగా అవకాశాలు రానున్నాయి.
మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక
ఇక ప్రత్యక్షమే
నేరుగా ఓట్లు వేస్తేనే
చైర్మన్ అయ్యే అవకాశం
రూ.కోట్లు కుమ్మరిస్తే తప్ప
గట్టెక్కలేని వైనం
ఇప్పటికే ఎమ్మెల్యేల వద్ద
ప్రారంభమైన లాబీయింగ్
రిజర్వేషన్ ఖరారయ్యే వరకూ
హామీ ఇవ్వలేమంటున్న పెద్దలు
సీట్ల ఆధారంగా డబ్బు సర్దుకుంటున్న ఆశావహులు
వైఎస్సార్‌సీపీ హయాంలో
సామాన్యులకే చైర్మన్ పీఠం
డబ్బుపైనే కూటమి ఆశలు..
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ప్రజల్లో భారీ వ్యతిరేకత ఏర్పడింది. ఏ ఓటరును అడిగినా.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేవలం డబ్బుపై ఆధారపడి కూటమి నేతలు ఓటింగ్‌కు వెళ్లాలని భావిస్తున్నారు. దీంతో భారీగా డబ్బులు ఉన్న వారికే గాలం వేస్తున్నారు. ఇదే అదనుగా బడాబాబుల్లో ఆశలు మొదలయ్యాయి. ఎవరికి వారుగా ఎమ్మెల్యేల వద్ద లాబీయింగ్ మొదలుపెట్టారు. రిజర్వేషన్లు ఖరారు కాకముందే తమకే సీటు కావాలంటూ పట్టుబడుతునట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రూ.లక్షలు దాటి చైర్మన్ పీఠం రూ.కోట్లు పలుకుతోందని తెలిసింది.
సామాన్యులను పీఠం ఎక్కించిన వైఎస్సార్ సీపీ..
జిల్లాలో పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, పెనుకొండ, హిందూపురం, మడకశిర మున్సిపాలిటీలు ఉన్నాయి. 2021 ఎన్నికల్లో ఆరు స్థానాలనూ వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుంది. అప్పట్లో ఉన్న నిబంధనల ప్రకారం అత్యధిక సీట్లు సాధించి వారిలో ఒకరికి చైర్మన్ పీఠం కట్టబెట్టారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎలాంటి రాజకీయ అనుభవం, నేపథ్యంలేని సామాన్యులకు, మహిళలకు సైతం అవకాశం కల్పించారు. అందులోనూ బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు పెద్దపీట వేశారు. దీంతో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోనూ సామాన్యులే చైర్మన్ పీఠం అధిరోహించారు.
ఎంతైనా తీసుకోండి చైర్మన్‌ను చేయండి
ఆగండి.. ఆగండి
రిజర్వేషన్ రానివ్వండి
ఎలాగైనా ఈ పీఠం
నాకే దక్కాలి


