రైతులకు పంగనామం | - | Sakshi
Sakshi News home page

రైతులకు పంగనామం

Sep 6 2026 2:07 AM | Updated on Sep 6 2026 2:07 AM

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: రామగిరి మండలంలోని పలువురు రైతులు పండించిన కంది, పప్పుశనగ ఏడు నెలల క్రితం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేశారు. వారం, పదిరోజుల్లో నేరుగా ఖాతాల్లోనే డబ్బు జమ అవుతుందని మార్క్‌ఫెడ్‌ సంస్థ అధికారి శ్రీనివాసులు చెప్పారు. ఇప్పటికే ఏడునెలలు దాటుతున్నా ఒక్క రూపాయి అందలేదు. దీంతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. తమ సమస్య తెలిసినా... స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత కనీసం పట్టింతుకోవడం లేదని రైతుల వాపోతున్నారు.

రూ.14 లక్షలకు టెండర్‌..

దుబ్బార్లపల్లి గ్రామానికి చెందిన అశోక్‌, లక్ష్మీనారాయణ, పెదయ్య, నాగేంద్ర, శివయ్య, బోయ ఓబలేష్‌, బుర్రా నరసింహులు దాదాపు 450 (50 కేజీలు) బస్తాల వేరుశనగను రామగిరిలోని వ్యవసాయశాఖ కార్యాలయ ఆవరణలో మార్క్‌ఫెడ్‌ సంస్థ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్మారు. మొత్తంగా రూ.13,16,250 రావాల్సి ఉండగా... నేటికీ ఒక్క రూపాయి కూడా అధికారులు ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చుట్టూ తిరిగి విసిగిపోయిన తాము ఇటీవలే రామగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. పండించిన పంటకు గిట్టుబాటు లేదని, ప్రభుత్వమే పంట కొనుగోలు చేసినా డబ్బులివ్వకపోతే తాము కుటుంబాలను ఎలా పోషించుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులు చర్యలు తీసుకుని తమకు రావాల్సిన సొమ్మును వెంటనే ఇప్పించే విధంగా చూడాలని కోరుతున్నారు. కాగా, ఈఏడాది రబీలో రైతులు సాగుచేసిన కందిపంటకు కూడా రెండు, మూడు క్వింటాళ్లను పట్టుకొని సంస్థ యాజమాన్యం రైతుల ఖాతాల్లో సొమ్మును జమ చేసినట్లు రామగిరి, కనగానపల్లి మండలాలకు చెందిన రైతులు పేర్కొన్నారు.

పరిటాల ఇలాకాలో

‘మార్క్‌ఫెడ్‌’ భారీ మోసం

ఏడు నెలల క్రితం కంది,

పప్పుశనగ కొనుగోళ్లు

నేటి వరకూ డబ్బులివ్వకుండా

తిప్పుకుంటున్న వైనం

రూ.14 లక్షలు రావాలంటూ

రైతుల ఆందోళన

మార్క్‌ఫెడ్‌ అధికారిపై

ఇటీవల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

రైతుల సమస్యలు తెలిసీ

స్పందించని ‘ఎమ్మెల్యే పరిటాల’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement