సాయి స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

సాయి స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేద్దాం

Sep 6 2026 2:07 AM | Updated on Sep 6 2026 2:07 AM

ప్రశాంతి నిలయం: ‘‘అందరినీ ప్రేమించు– అందరినీ సేవించు’’ అన్న సత్యసాయి స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా ప్రతి సాయి భక్తుడు ముందుకు సాగాలని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రాజు పిలుపునిచ్చారు. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన విశాఖపట్నం జిల్లా సత్యసాయి భక్తులకు శనివారం ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో సత్సంగ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌జే రత్నాకర్‌ రాజు మాట్లాడుతూ సత్యసాయి ప్రేమ, సేవ, సత్యం అన్న మానవతా విలువలను ఆచరించి చూపారన్నారు. నేటి తరానికి సాయి బోధించిన విలువలే ఆచరణ మార్గాలు కావాలన్నారు. అభాగ్యులకు ఆపన్న హస్తం అందించాలన్న సత్యసాయి సంకల్పం ఎంతో గొప్పదన్నారు. వైద్యం వ్యాపార మయమైన ఈ రోజుల్లో సత్యసాయి వైద్య సంస్థలు నయా పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నాయంటే సత్యసాయి సంకల్ప బలంతోనే సాధ్యమైందన్నారు. ప్రశాంతి నిలయానికి వచ్చే ప్రతి భక్తుడు తన బిడ్డే అన్న విశ్వాసంతో సత్యసాయి నడిచారని, అందుకే ప్రశాంతి నిలయానికి ధనికులు వచ్చినా, పేదలు వచ్చినా నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేని వ్యవస్థను రూపొందించారన్నారు. ప్రశాంతి నిలయానికి వచ్చి వెళ్లే ప్రతి భక్తుడు తనను తాను సంపూర్ణుడిగా స్వయం పరివర్తన సాధిస్తూ సమాజానికి మంచిని పంచాలన్నారు.

అలరించిన సంగీత కచేరీ

విశాఖపట్నం జిల్లా సత్యసాయి భక్తులు పర్తియాత్ర ముగింపు సందర్భంగా సాయికుల్వంత్‌ సభా మందిరంలో సంగీత విభావరి నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ ఆయన ప్రేమ తత్వాన్ని కీర్తిస్తూ నిర్వహించిన కచేరీతో భక్తులు పరవశించి పోయారు.

సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement