నల్లచెరువు: పాలపాటిదిన్నె ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. వేకువజాము నుంచే ఆలయ అర్చకులు ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి పూజలతో పాటు అభిషేకాలు చేశారు. శ్రావణ మాసం చివరి శనివారం కావడంతో స్వామి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు క్యూలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని మంగళ వాయిద్యాలు, భజన, కోలాటాల మధ్య ఊరేగించారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు. కదిరి ఆర్టీసీ అధికారులు స్వామి దర్శనానికి వచ్చే భక్తుల ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా బస్సులను నడిపారు. ఆలయ ప్రాంగణంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ మక్బూల్ బాష బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంజనేయ స్వామి దర్శనానికి క్యూలో వెళ్తున్న భక్తులు, పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి


