సోషల్‌ మీడియాపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాపై అప్రమత్తంగా ఉండాలి

Sep 6 2026 2:07 AM | Updated on Sep 6 2026 2:07 AM

పెనుకొండ రూరల్‌: మహిళలు, బాలికలు సోషల్‌ మీడియా వేదికలపై అప్రమత్తంగా ఉండాలని అడిషనల్‌ ఎస్పీ అంకిత సురాన పేర్కొన్నారు. శనివారం పట్టణంలో మహిళల భద్రతపై ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలోని భువన విజయం సమావేశం మందిరంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల భద్రతకు పోలీస్‌ శాఖ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సోషల్‌ మీడియాను అవసరానికి మించి వినియోగించరాదన్నారు. అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోరాదన్నారు. ఆర్డీఓ ఆనంద్‌ కుమార్‌ మాట్లాడుతూ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ రాఘవన్‌, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, శోభ, రవి కుమార్‌, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

భార్యాభర్తల మధ్య అవగాహన ఉండాలి

డీఎస్పీ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన పోలీస్‌ ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌ను అడిషనల్‌ ఎస్పీ అంకిత సురాన సందర్శించారు. కౌన్సెలింగ్‌కు వచ్చిన దంపతులతో మాట్లాడారు. సహనం, ఓర్పుతో ఉండి పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలన్నారు. కుటుంబ బంధాలను కాపాడుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement