‘నేతన్న సేవ’ తేదీలను పొడిగించడం అన్యాయం | - | Sakshi
Sakshi News home page

‘నేతన్న సేవ’ తేదీలను పొడిగించడం అన్యాయం

Sep 5 2026 7:31 AM | Updated on Sep 5 2026 7:31 AM

ధర్మవరం: నేతన్న సేవ పథకం కింద చేనేతల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసే తేదీలను పొడిగించడం అన్యాయమని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్‌ జేవీ రమణ, పట్టణ అధ్యక్షుడు ఖాదర్‌బాషా, కార్యదర్శి గుంపు హరిలు తెలిపారు. స్థానిక ఏపీ చేనేత కార్మిక సంఘం కార్యాలయంలో శుక్రవారం వారు మాట్లాడుతూ మొదటి విడతలో చేనేత కార్మికులకు నేతన్న సేవ పథకం కింద రూ.25వేలు కొంతమందికి వేశారన్నారు. పథకం వర్తించని అర్హులైన కార్మికులకు ఆగస్టు 30వతేదిన అందరి అకౌంట్‌లోకి జమ చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ చెప్పినా ఇంత వరకు డబ్బులు జమకాలేదన్నారు. మళ్లీ 10వ తేదీన జమ చేస్తామని మంత్రి చెప్పడం ఇలా తేదీలు పొడిగించడం సమంజసం కాదన్నారు. ఇప్పటికై నా అర్హుల అకౌంట్లలో జమ చేయాలని లేకుంటే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్నం సూరి, పులిచెర్ల హరి, లోకేష్‌, సీఐటీయూ నాయకులు ఎల్‌.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement