ఆటలతో జీవితాలకు బాటలు | - | Sakshi
Sakshi News home page

ఆటలతో జీవితాలకు బాటలు

Sep 5 2026 7:07 AM | Updated on Sep 5 2026 7:07 AM

బుక్కపట్నం బాలికల ఉన్నత పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ కె.ఉషారాణి అంకిత భావంతో పనిచేస్తూ వెనుకబడిన ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటేలా తీర్చిదిద్దుతున్నారు. తద్వారా పాఠశాలకూ ఎంతో పేరు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే బుక్కపట్నం పాఠశాలలో చదివే విద్యార్థిని హైందవి.. ఉషారాణి ప్రోత్సాహంతో 2023–24లో వెయిట్‌ లిఫ్టింగ్‌లో రాష్ట్ర స్థాయి విజేతగా నిలిచింది. 2024–25లో పాఠశాలకు చెందిన హనీద, భార్గవి రాష్ట్ర స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో సత్తా చాటారు. అలాగే విజయవాడలో జరిగిన ‘రంగోత్సవం’ పోటీల్లోనూ పాఠశాల విద్యార్థులను మొదటి స్థానంలో నిలబెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement