సాయి కీర్తనం..కృష్ణ లీలామృతం | - | Sakshi
Sakshi News home page

సాయి కీర్తనం..కృష్ణ లీలామృతం

Sep 5 2026 7:07 AM | Updated on Sep 5 2026 7:07 AM

ప్రశాంతి నిలయం: సత్యసాయి సన్నిధిలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక ఫల, పుష్ప, దళాలతో పాటు నెమలి ఈకలతో అలంకరించిన సత్యసాయి మహాసమధి చెంత వేలాది మంది భక్తులు ‘‘జగద్గురువు నీవే..మము నడిపించు సద్గురువు నీవే’’ అంటూ శ్రీ కృష్ణుని స్మరిస్కూ...సాయిని వేడుకుంటూ గీతాలాపన చేశారు. ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థుల వేదపఠనంతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం శ్రీకృష్ణ లీలలు వివరిస్తూ... సత్యసాయి విద్యార్థులు కృష్ణాష్టకం నిర్వహించారు. చక్కటి భక్తిగీతాలతో సంగీత కచేరీ నిర్వహించారు. అంతకుముందు గోకులం నుంచి గోవులను, పశుపక్షాదులను పుట్టపర్తి వీధులలో ఊరేగింపుగా సాయికుల్వంత్‌ సభా మందిరానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రాజు గోవులకు పాలు తాగించి, పండ్లు తినిపిస్తూ గోసేవ నిర్వహించారు.

ప్రశాంతి నిలయంలో

ఘనంగా కృష్ణజన్మాష్టమి వేడుకలు

గోసేవ చేసిన ఆర్‌జే రత్నాకర్‌ రాజు

నయన మనోహరం జనని నృత్యరూపకం

శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకల్లో విశాఖపట్నం జిల్లా బాలవికాస్‌ విద్యార్థులు ఆధ్యాత్మిక భక్తిరస సాంస్కృతిక ప్రదర్శనతో అందరినీ అలరించారు. ‘పర్తియాత్ర’లో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన చిన్నారులు... మానవ జీవితంలో తల్లి పాత్ర, తల్లి ప్రేమను వర్ణిస్తూ ‘జనని’ నాటికను నయన మనోహరంగా ప్రదర్శించారు. మహనీయుల జీవితాల్లో తల్లి ప్రేమ, త్యాగం ఎలా స్ఫూర్తిగా నిలిచాయో నృత్యరూపకం ద్వారా కళ్లకు కట్టారు. సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ పుట్టపర్తి ప్రాంతంలోని పేదలకు తాగునీరు, బడి, ఆస్పత్రి నిర్మించాలని కోరిన తీరు..ఆమె కోర్కెను మన్నించి సత్యసాయి సేవా కార్యక్రమాలు చేపి చూపిన తీరును చక్కగా వివరించారు. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement