ఖాద్రీశునికి ఉయ్యాల ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

ఖాద్రీశునికి ఉయ్యాల ఉత్సవం

Sep 5 2026 7:07 AM | Updated on Sep 5 2026 7:07 AM

కదిరి టౌన్‌: శ్రావణ శుక్రవారం సందర్భంగా ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభుడైన శ్రీవారికి శుక్రవారం రాత్రి అర్చకులు ఉయ్యాల ఉత్సవం నిర్వహించారు. ఉయ్యాల సేవలో భాగంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు భారీగా సంఖ్యలో పాల్గొని ఖాద్రీశుడిని కీర్తిస్తూ గీతాలు ఆలపించారు.

వర్షం కోసం

ముస్లింల ప్రార్థనలు

అమడగూరు: మండల పరిధిలోని మహమ్మదాబాద్‌ గ్రామంలోని ఈద్గా వద్ద శుక్రవారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఈద్గా వద్ద గంట పాటు ప్రార్థనలు నిర్వహించి వర్షాలు కురిపించాలంటూ అల్లాహ్‌ను వేడుకున్నారు. దేవుడి దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.

సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం

ధర్మవరం అర్బన్‌: పారా మెడికల్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని కాంట్రాక్ట్‌ మెడికల్‌, పారా మెడికల్‌ ఉద్యోగులు తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అర్హులైన కాంట్రాక్ట్‌ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్‌ చేయాలని, అప్పటి వరకూ వంద శాతం గ్రాస్‌ వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విధి నిర్వహణలో మృతి చెందిన కాంట్రాక్ట్‌ ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. తమ న్యాయమైన సమస్యల సాధనకు నిరంతరం పోరాడుతామన్నారు. నిరసనలో వెంకట రామంజినేయులు, మహబూబ్‌ చాన్‌, పద్మ, కమలమ్మ, జయమ్మ, మహాదేవి, ఉమారాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement