తెలుగుసారు.. సమాజహితుడు | - | Sakshi
Sakshi News home page

తెలుగుసారు.. సమాజహితుడు

Sep 5 2026 7:07 AM | Updated on Sep 5 2026 7:07 AM

చిలమత్తూరులోని పొట్టి శ్రీరాములు హైస్కూల్‌ తెలుగు టీచర్‌ హర్షవర్దన్‌రెడ్డి తెలుగు భాషాభివృద్ధితో పాటు పాఠశాల అభివృద్ధికి ఇతోధికంగా దోహదం చేస్తున్నారు. అలాగే విద్యార్థులకు క్రీడా పరికరాలు, దుస్తులు అందించి క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. అలాగే తాను పనిచేస్తున్న పొట్టి శ్రీరాములు హైస్కూల్‌లో పొట్టి శ్రీరాములు పేరుతో 3డి ఆకృతిలో ఉద్యానవనం ఏర్పాటుకు కృషి చేశారు. ఇక బ్రిటీష్‌ హయాంలో అనంతకు తొలికలెక్టర్‌గా వ్యవహరించి ప్రజల మనసులు గెలుచుకున్న థామస్‌ మన్రో గురించి నేటి తరానికి తెలియజెప్పాలని హర్షవర్దన్‌రెడ్డి భావించారు. స్నేహితులు, సహచర ఉపాధ్యాయుల సహకారంతో మన్రో గుర్తుగా కోడూరు తోపు వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయించి ఎంతో విశిష్టత కల్పించారు. అందుకే నేటికీ దాన్ని థామస్‌ మన్రో తోపు అని పిలుస్తుంటారు. ఎక్కడ పనిచేస్తే అదే తన ఊరిలా భావించే హర్షవర్దన్‌రెడ్డి ఆ గ్రామాభివృద్ధికీ కృషి చేస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement