పరిగి మండలం మోదా ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న రామకృష్ణ... స్కౌట్స్ అండ్ గైడ్స్ కబ్ మాస్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు. విద్యార్థులను స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో చేర్చడంతో పాటు వారికి తర్ఫీదు ఇచ్చి జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో విశేషంగా కృషి చేస్తున్నారు. పిల్లల్లో క్రమశిక్షణ, దేశ సేవ, సమాజ సేవ, వ్యక్తి గత సేవ తదితర అంశాల పట్ల విద్యార్థులను చైతన్యవంతులను చేయడంలో సఫలీకృతులయ్యారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌పై ఆసక్తి పెంచుకున్న ఆయన తొలుత బేసిక్ కోర్స్, ఆ తర్వాత అడ్వాన్స్ కోర్స్ ఫర్ కబ్ మాస్టర్, అనంతరం హిమాలయన్ ఉడ్ బ్యాడ్జ్ కబ్ మాస్టర్, అసిస్టెంట్ లీడర్ ట్రైనర్ కోర్సును పూర్తి చేశారు. అనంతరం విద్యార్థులను చైతన్యవంతులను చేసి స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంలో రాణింపజేసి దేశసేవకు పంపుతున్నారు.


