భూముల విలువ రెట్టింపు | - | Sakshi
Sakshi News home page

భూముల విలువ రెట్టింపు

Sep 4 2026 7:35 AM | Updated on Sep 4 2026 7:35 AM

పుట్టపర్తి: జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలైన అమడగూరు, ఓడీ చెరువుల్లో సైన్స్‌ సిటీ ఏర్పాటుకు వైఎస్సార్‌ కృషి చేశారు. దీంతో ఎకరా రూ.10 వేలు కూడా చేయని భూముల విలువ అమాంతం పెరిగాయి. అలాగే అప్పట్లో పుట్టపర్తి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఏర్పాటు చేసి పట్టణాభివృద్ధికి కృషి చేశారు. బెంగళూరుకు అతి సమీపంగా ఉన్న కొడికొండ చెక్‌పోస్టు వద్ద ఐటీ పరిశ్రమల ఏర్పాటు కోసం లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్నిపట్టించుకోలేదు. అలాగే జలయజ్ఞంలో భాగంగా హంద్రీ–నీవా కాలువ వైఎస్సార్‌ హయాంలోనే 80 శాతం పూర్తయింది. ఈ పథకానికి అప్పట్లో రూ.3 వేల కోట్లు కేటాయించి యుద్ధ ప్రాతిపాదికన పనులు చేశారు. అప్పటి రాజన్న ముందు చూపుతో నేడు కృష్ణా జలాలు అందుబాటులోకి వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement