చెలరేగిన ‘అనంత’ బౌలర్లు | - | Sakshi
Sakshi News home page

చెలరేగిన ‘అనంత’ బౌలర్లు

Sep 4 2026 7:29 AM | Updated on Sep 4 2026 7:29 AM

అనంతపురం: అనంత క్రీడాగ్రామంలోని ఆర్‌సీజీ, ఏసీఏ మైదానాల్లో ఏసీఏ అండర్‌–23 పురుషుల మల్టీడే క్రికెట్‌ టోర్నీ నాల్గో రౌండ్‌ మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగుతున్నాయి. మంగళవారం అనంత బౌలర్ల ధాటికి కర్నూలు బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న జట్టు 40.1 ఓవర్ల వద్ద 118 పరుగులకు ఆలౌట్‌ అయింది. కర్నూలు బ్యాటర్లలో మురారీ హృదయ్‌ ఒంటరి పోరాటంతో 31 పరుగులు సాధించాడు. అనంత బౌలర్లలో జి.మల్లికార్జున 4, కె.ప్రమోద్‌కుమార్‌ 3, దీపక్‌కుమార్‌ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన అనంత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 222 పరుగులు సాధించింది. అనంత బ్యాటర్లలో ఎన్‌.మనోజ్‌కుమార్‌ 42, జయంత్‌కృష్ణ 86, ఎంకే దత్తారెడ్డి 52 పరుగులు సాధించారు. కర్నూలు బౌలర్‌ దినేష్‌కుమార్‌ రెండు వికెట్లు తీశాడు.

● మరో మ్యాచ్‌లో నెల్లూరుతో చిత్తూరు జట్టు తలపడింది. టాస్‌ గెలిచి తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 307 పరుగులకు ఆలౌట్‌ అయింది. బ్యాటర్లు నిఖిలేశ్వరరెడ్డి 80, సుతేజ్‌రెడ్డి 40, ఏకాక్షర్‌ 51 పరుగులు సాధించారు. చిత్తూరు బౌలర్లలో ఆర్‌.రెడ్డి ప్రకాష్‌ తన స్పిన్‌ మాయాజాలంతో ఆరు వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్‌ కృష్ణతేజారెడ్డి, ఎం.ముఖేష్‌ చెరో రెండు వికెట్లు చొప్పున తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 72 పరుగులు సాధించింది. బ్యాటర్‌లు లోహిత్‌ లక్ష్మీనారాయణ 36, హర్షసాయి 29 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement