సాకే వినయ్‌పై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సాకే వినయ్‌పై చర్యలు తీసుకోవాలి

Sep 4 2026 7:29 AM | Updated on Sep 4 2026 7:29 AM

పుట్టపర్తి: తనపై ఆరోపణలు చేస్తూ సోషల్‌ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న బీఎస్పీ ధర్మవరం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సాకే వినయ్‌కుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు రుకియా బేగంతో పాటు ఎస్పీ సతీష్‌ కుమార్‌కు ఐసీడీఎస్‌ పీడీ ప్రమీళ ఫిర్యాదు చేశారు. మంగళవారం కొత్తచెరువులోని నూతన వన్‌ స్టాప్‌ సెంటర్‌ పరిశీలనకు రుకియా బేగం విచ్చేశారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఆశ్రయం పొందుతున్న బాధితులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్‌ పీడీ ప్రమీళ ఆమెకు లిఖిత పూర్వకంగా సాకే వినయ్‌కుమార్‌పై ఫిర్యాదు చేశారు. పీడీ మాట్లాడుతూ తనపై జరుగుతున్న నిరంతర వేధింపులతో మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానన్నారు. భయాందోళనల మధ్య విధులు నిర్వర్తిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వారం పీజీఆర్‌ఎస్‌లో లేని పోని అర్జీలు ఇస్తూ, సోషల్‌ మీడియాలో ఆధారాలు లేని అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఐసీడీఎస్‌లో సంక్షేమ పథకాలు సజావుగా సాగకుండా ఆటంకం కలిగిస్తున్నారన్నారు. తన కార్యాలయంలో పని చేస్తున్న కొందరు సిబ్బంది సాకే వినయ్‌ కుమార్‌కు ఆఫీస్‌ సమాచారాన్ని అందిస్తూ సహకరిస్తున్నారన్నారు. సొంత శాఖ అధికారి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా బయటి వ్యక్తులతో చేతులు కలిపిన సిబ్బందిని గుర్తించి తక్షణమే చర్యలు తసుకోవాలని ఎస్పీ సతీష్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు.

రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలికి

ఐసీడీఎస్‌ పీడీ ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement