ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

Sep 4 2026 7:29 AM | Updated on Sep 4 2026 7:29 AM

ప్రశాంతి నిలయం: పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విచ్చేసిన మలేషియా సత్యసాయి భక్తులు మంగళవారం సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం శ్రీ సత్యసాయి అష్టోత్తర శత నామావళి నిర్వహించారు. వేలాది మంది సామూహికంగా నిర్వహించిన నామావళితో సాయికుల్వంత్‌ సభా మందిరం మార్మోగింది. సాయంత్రం సత్యసాయిని కీర్తిస్తూ సంగీత విభావరి నిర్వహించారు. చక్కటి భక్తిగీతాలతో నిర్వహించిన సంగీత విభావరి భక్తులను మైమరపించింది. భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement