బీడుగా హంద్రీనీవా పరివాహక ప్రాంతం | - | Sakshi
Sakshi News home page

బీడుగా హంద్రీనీవా పరివాహక ప్రాంతం

Sep 4 2026 1:54 AM | Updated on Sep 4 2026 1:54 AM

పుట్టపర్తి అర్బన్‌: దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్లు పారించారు. అయితే చంద్రబాబు పాలనలో హంద్రీనీవా నీళ్లు కుప్పం తీసుకువెళ్లే పన్నాగంతో లైనింగ్‌ పనులు చేయించారు. ఇదే ఇప్పుడు రైతులకు శాపంగా మారింది. గతంలో హంద్రీనీవా కాలువకు నీళ్లు రాగానే కాలువకు ఇరువైపులా ఉన్న వేలాది బోరు బావులు, వ్యవసాయ బావులు నీటితో కళకళ లాడేవి. దీంతో ఏటా రెండు పంటలను పండించుకుంటూ జీవనం సాగించేవారు. గత ఏడాది హంద్రీనీవా కాలువకు సిమెంట్‌ పూతతో లైనింగ్‌ వేశారు. దీంతో ఒక్క చుక్క నీళ్లు కూడా భూమిలోకి ఇంక కుండా నేరుగా చిత్తూరు జిల్లా కుప్పంకు వెళ్లిపోతున్నాయి.

3 టీఎంసీల నికర జలాలు సాధించినా..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులకు 3 టీఎంసీల నీళ్లు కావాలని అప్పటి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పట్టుబట్టి 3 టీఎంసీల నికర జలాలను సాధించారు. అయితే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నేటికీ ఒక్క టీఎంసీ నీళ్లను కూడా వినియోగించుకోక పోవడం విశేషం. హంద్రీనీవా జలాలు జిల్లాకు వారం రోజుల నుంచి వస్తున్నా హంద్రీనీవా పరివాహక ప్రాంతంలోని బావులు, బోర్లు రీచార్జ్‌ కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement