రాజన్నకు నీరాజనం | - | Sakshi
Sakshi News home page

రాజన్నకు నీరాజనం

Sep 3 2026 8:47 AM | Updated on Sep 3 2026 8:47 AM

సాక్షి, పుట్టపర్తి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు బుధవారం జిల్లా వ్యాప్తంగా జరిగాయి. వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో పాటు వైఎస్సార్‌ అభిమానులు ఊరూరా మహానేత విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేసి ఘన నివాళులర్పించారు. పలు ప్రాంతాల్లో సేవాకార్యక్రమాలు నిర్వహించారు. అన్నదానం, వస్త్ర దానంతో పాటు ఆస్పత్రుల్లోని రోగులకు పండ్లు, బ్రెడ్డు పంచిపెట్టారు.

జనరంజక పాలన అందించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే ధ్యేయంగా ముందుకు సాగుదామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్‌ పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆమె పార్టీ శ్రేణులతో కలిసి పెనుకొండలోని మడకశిర రోడ్డులో ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్‌ మాట్లాడుతూ.. హంద్రీ–నీవా పథకంతో ఉమ్మడి అనంతపురం జిల్లా సాగునీటి కష్టాలు తీర్చిన అపరభగీరథుడు వైఎస్సార్‌ అని కొనియాడారు. అప్పట్లో వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన పథకాలు.. ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని గుర్తు చేశారు. వైఎస్సార్‌ ఆశయ సాధన దిశగా ఆయన కుమారుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ముందుకెళ్తున్నారని, అందరం ఆయనకు అండగా నిలుద్దామన్నారు. అనంతరం రొద్దం మండల కేంద్రంలో నిర్వహించిన వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమంలోనూ ఆమె పాల్గొన్నారు.

మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్‌ కేశవరెడ్డి అన్నారు. బుధవారం ఆయన పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీ సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద రోగులకు పాలు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఈసందర్భంగా డీఎస్‌ కేశవరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు చెబితే సంక్షేమం, అభివృద్ధి గుర్తుకు వస్తుందన్నారు. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహరహం కృషి చేశారని కొనియాడారు. అందుకే జనం కూడా ఆయన్ను తమ ఇలవేల్పుగా గుండెగుడిలో పెట్టి చూసుకుంటున్నారన్నారు.

రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన హయాంలో వ్యవసాయానికి పెద్దపీట వేశారని వైఎస్సార్‌ సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా బుధవారం మడకశిరలోని వైఎస్సార్‌ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ‘రైతుబాంధవుడు రాజశేఖరుడు.. వ్యవసాయాన్ని పండుగ చేసింది రాజశేఖరుడే’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.

హిందూపురంలోని పరిగి బస్టాండులోని వైఎస్సార్‌ విగ్రహానికి వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్‌ దీపిక భర్త వేణురెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చౌళూరు మధుమతి గజమాల వేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వైఎస్సార్‌ హయాంలో ప్రవేశపెట్టి.. అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ తదితర పథకాల గురించి కొనియాడారు. ఆయా పథకాలతో ఎందరో లబ్ధి పొంది... తమ జీవితాల్లో వెలుగులు నింపుకున్నారన్నారు. రాజన్నా అని పిలిస్తే నేనున్నానంటూ ముందుకు వచ్చిన నాయకుడని, అందుకే ఆయన అందరివాడయ్యారన్నారు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భౌతికంగా ప్రజల మధ్య లేకున్నా.. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు సజీవంగా ఉన్నాయని వైఎస్సార్‌ సీపీ కదిరి సమన్వయకర్త బీఎస్‌ మక్బూల్‌ అన్నారు. కదిరిలోని మున్సిపల్‌ కార్యాలయం ప్రాంగణంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మక్బూల్‌ మాట్లాడుతూ.. జలప్రదాత.. సంక్షేమ పథకాల పితామహుడు, హంద్రీనీవా కాలువ తెచ్చిన మహోన్నత వ్యక్తి వైఎస్సార్‌ అని కొనియాడారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ముస్లింల దుస్థితిని గుర్తించి రిజర్వేషన్లతో లబ్ధి చేకూర్చిన గొప్పవ్యక్తి అని కొనియాడారు.

రాజశేఖరరెడ్డి అంటేనే సంక్షేమ సంతకమని, అందుకే ఆయన జన హృదయ నేతగా మారారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన పథకాలతో పాటు ఆయన ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. బుధవారం బత్తలపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించి రాజన్న రాజ్యానికి బాటలు వేద్దామని పిలుపునిచ్చారు.

సాగులో సాయంగా నిలిచిన రైతు బాంధవుడు.. పేదవాడి ఆరోగ్యానికి రక్షగా నిలిచిన వైద్యుడు.. విద్యార్థుల భవితకు బాటలు వేసిన దార్శనికుడు.. నిరుపేదల బతుక్కి భరోసా కల్పించిన మహా మనీషి...అందుకే ఆయన భౌతికంగా దూరమైనా.. పచ్చని పైరులో..నిరుపేదల నవ్వుల్లో.. నిత్యం కనిపిస్తూనే ఉంటారు. అందుకే ఆయన వర్ధంతి వేళ ఊరూవాడా ఘనంగా నివాళులర్పించింది. రాజన్నా నినుమరువలేమన్నా అంటూ

అభిమానం చాటుతూ అంజలి ఘటించింది.

వాడవాడలా వైఎస్సార్‌ వర్ధంతి

కార్యక్రమాలు

సేవా కార్యక్రమాలతో

స్ఫూర్తిగా నిలిచిన అభిమానులు

ఊరూరా విగ్రహాలకు

క్షీరాభిషేకాలు చేసిన నాయకులు

రాజన్న ఆశయ సాధనే

ధ్యేయమని వెల్లడి

‘పురం’లో సేవా కార్యక్రమాలు..

జన హృదయ నేత రాజశేఖరరెడ్డి..

ప్రజల గుండెల్లోనే రాజన్న..

వైఎస్సార్‌ ఆశయ సాధనే ధ్యేయం..

రైతు బాంధవుడు రాజశేఖరుడు..

సంక్షేమ పథకాల పితామహుడు వైఎస్సార్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement