సాయి నామం.. సుమధురగానం | - | Sakshi
Sakshi News home page

సాయి నామం.. సుమధురగానం

Sep 3 2026 8:47 AM | Updated on Sep 3 2026 8:47 AM

ప్రశాంతి నిలయం: సత్యసాయిని కీర్తిస్తూ భక్తులు ఆలపించిన గీతాలతో ప్రశాంతి నిలయం ప్రతిధ్వనించింది. సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ స్థాపించి 54 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ప్రశాంతి నిలయంలో 54వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఉదయం సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ఉద్యోగులు సత్యసాయి మహా సమాధి చెంత ‘సేవా మధురం’ పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయి సేవలను, ఆధ్యాత్మిక తత్వాన్ని కొనియాడుతూ వారు నిర్వహించిన సంగీత కచేరీ భక్తకోటిని అలరించింది. అనంతరం ట్రస్ట్‌ సభ్యులు మాట్లాడుతూ.. సత్యసాయి మానవాళికి సేవలు అందించే లక్ష్యంతో 1972 సెప్టెంబర్‌ 2న సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ను ప్రారంభించారన్నారు. ఆ నాటి నుంచి నేటి వరకూ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విద్య, వైద్యం, తాగునీరు, సామాజిక సేవలు నిర్వహిస్తు అభాగ్యులకు తోడుగా నిలుస్తోందని వెల్లడించారు.

నయనానందకరం నృత్యరూపకం

‘భక్తి శాశ్వతం... సురక్షితం’ అన్న సందేశాన్నిస్తూ మలేషియాకు చెందిన సత్యసాయి విద్యాసంస్థల చిన్నారులు నిర్వహించిన ‘ఎటర్నల్‌ ప్రాగ్రెన్స్‌ ఆఫ్‌ భక్తి’ నాటిక నయనానందకరంగా సాగింది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన జోన్‌ –5కు చెందిన మలేషియా భక్తులు బుధవారం సాయంత్రం సాయికుల్వంత్‌ సభా మందిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పురాణ ఇతిహాసాలను నుంచి రామాయణం, భాగవతం, భారతంలోని వివిధ ఘట్టాలను ప్రదర్శిస్తూ భక్తి తరతరాలుగా మానవాళిని సన్మార్గంలో నడుపుతున్న తీరును చిన్నారులు చక్కగా వివరించారు. అనంతరం వారంతా సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

ఘనంగా సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ 54వ వార్షికోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement