గాండ్లపెంట: సంక్షేమ పథకాలతో జన రంజక పాలన అందించిన వైఎస్సార్ అంటే పేదలకు ఎనలేని అభిమానం. తన హయాంలో రైతులకే కాదు..రైతు కూలీలకు ఏ కష్టమూ కలగకుండా పాలన సాగించారు. అందుకే ఆయన వర్ధంతి సందర్భంగా బుధవారం మండల పరిధిలోని కత్తివారిపల్లి గ్రామ శివారులోని పొలాల్లో పనిచేసేందుకు వచ్చిన కూలీలు దివంగత నేత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర సేవలను గుర్తు చేసుకున్నారు. కల్మషం లేని ఆ మట్టిమనుషులు తమ బతుకులు మార్చిన మారాజుకు అంజలి ఘటించారు.


