తండ్రి మందలింపు.. కుమారుల అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

తండ్రి మందలింపు.. కుమారుల అదృశ్యం

Sep 3 2026 8:47 AM | Updated on Sep 3 2026 8:47 AM

క్షేమంగా పట్టుకొచ్చి అప్పగించిన పోలీసులు

ధర్మవరం రూరల్‌: మండలంలోని తుంపర్తిలో తండ్రి మందలించడంతో ఇద్దరు కుమారులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. రమేష్‌, కృష్ణకుమారి దంపతులకు ఇంటర్‌, పదో తరగతి చదువుతున్న దినేశ్‌, ఆర్యన్‌ సంతానం. వారు తరచూ సెల్‌ఫోన్‌ చూస్తూ చదువుపై శ్రద్ధ చూపడం లేదని తండ్రి సోమవారం సాయంత్రం మందలించాడు. దీంతో ఇద్దరు కుమారులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుమారులు కనిపించడం లేదని తల్లిదండ్రులు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు వారు విశాఖపట్నంలో ఉన్నట్లు గుర్తించారు. బుధవారం రాత్రి పిల్లలిద్దరినీ క్షేమంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు.

అప్పుల బాధతో బలవన్మరణం

సోమందేపల్లి(పరిగి): సోమందేపల్లి మండలంలోని కేతగానిచెరువు గ్రామానికి చెందిన నాగరాజు (42) అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేతగానిచెరువు గ్రామానికి చెందిన నాగరాజు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. ఇతనికి భార్య మంజులతో పాటూ ఇద్దరు సంతానం ఉన్నారు. నాగరాజుకు కొంతకాలంగా అప్పుల బాధలు ఎక్కువైనట్లు స్థానికులు తెలిపారు. దీంతో తరచూ మనస్తాపానికి గురయ్యేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ఆయన గత మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు చరణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో కార్మికుడి మృతి

తాడిపత్రి రూరల్‌: విద్యుత్‌ షాక్‌తో కార్మికుడు మృతి చెందిన ఘటన పట్టణ సమీపంలోని యల్లనూరు రోడ్డు రైల్వే గేటు వద్ద జరిగింది. అప్‌గ్రెడ్‌ సీఐ నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం ముర్షిదాబాద్‌ జిల్లా నర్షిపూర్‌ ప్రాంతానికి చెందిన మసూద్‌రాణా(25) యల్లనూరు రోడ్డు రైల్వే గేటు వద్ద జరుగుతున్న రైల్వే బ్రిడ్జి పనుల వద్ద కూలీగా పనిచేసేవాడు. బుధవారం వెల్డింగ్‌, సెంట్రింగ్‌ పనులు చేస్తున్న సమయంలో చేతిలోని ఫోకస్‌ లైట్‌కు ఉన్న జాయింట్‌ తెగి విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. సహచర కూలీలు వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మసూద్‌రాణా మృతి చెందాడని డాక్టర్‌ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement