మడకశిరరూరల్: మడకశిర డివిజన్‌లో ఆగా ఖాన్ రూరల్ సపోర్ట్ ప్రోగ్రామ్ (ఏకేఆర్‌ఎస్‌పీ)కు చెందిన ప్రతినిధుల బృందం మూడు రోజుల పర్యటన బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా పావగడలో క్షేత్ర స్థాయి పర్యటన, అనుభవాలను సమీక్షిస్తూ, వారి వారి రాష్ట్రాల భౌగోళిక, వాతావరణ, పంటల పరిస్థితులకు అనుగుణంగా ఏపీసీఎన్‌ఎఫ్ పద్ధతులను ఎలా అన్వయించుకోవాలనే అంశాలపై కమ్యూనిటీ ఇన్నోవేషన్ ఆఫీసర్ (సీటీఅండ్‌ఐఓ) లక్ష్మానాయక్ సమగ్ర సైద్ధాంతిక సమావేశం నిర్వహించారు. బృందం ప్రతినిధుల రెండు రోజుల క్షేత్ర స్థాయి పర్యటన అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం అమలు, రైతుకు కలిగే లాభాలు, తగ్గుతున్న పెట్టుబడి, పీఎండీఎస్ విత్తనాలు విత్తే విధానం, ఏ గ్రేడ్, ఏటీఎం, జీవ వైవిధ్య పంటల ప్రాధాన్యతతో పాటు తక్కువ వర్షపాత నమోదు పరిస్థితుల్లో పంట వ్యవస్థలను స్థిరంగా కొనసాగించే విధానాలను బృందం ప్రతినిధులకు ఆయన వివరించారు. ప్రకృతి వ్యవసాయ విధానం రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని వివరించారు. సమావేశంలో జాతీయ వనరుల సంస్థ అధిపతి వి. కృష్ణారావు, టెక్నికల్ ఏఓలు ఎం.హుమాయున్, సంతోష్, ఎన్‌ఆర్‌ఓ, ఏపీసీఎన్‌ఎఫ్ బృందం సభ్యులు సయ్యుద్ దాదాపీర్, నవీన్,మాస్టర్ ట్రైనర్ రమేష్, ఆర్‌వైఎస్‌ఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


