ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చట్టం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చట్టం చేయాలి

Sep 1 2026 3:18 AM | Updated on Sep 1 2026 3:18 AM

పుట్టపర్తి టౌన్‌: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో చట్టం చేసేంత వరకు నిరంతరం శాంతియుత పోరాటాలు కొనసాగిస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎర్‌ఎస్‌ రత్నాకర్‌ తెలిపారు. సోమవారం పుట్టపర్తి పట్టణంలో సాయి ఆరామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై కుట్ర చేస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేసిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ వ్యాప్తంగా అమలు చేశారన్నారు. దేశంలో ఎస్సీ లిస్టులో ఉన్న 1108 కులాలకు సమ న్యాయం, సామాజిక న్యాయం ఎలా చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఇదంతా దళితుల ఐక్యతపై కట్ర అని విమర్శించారు ఈ విధంగా మాల కులాలపై కుట్ర చేస్తుంటే మాల ప్రజాప్రతినిధులు నోరు మెదకపోవడం శోచనీయమన్నారు. దీనివల్ల ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని మాల జాతి ప్రజలు ఉనికి కోల్పోతారన్నారు. ఇప్పటికై ప్రతి ఒక్కరూ కళ్లు తెరిచి బయటకు వచ్చి ఎస్పీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో చట్టం చేసేంతవరకు శాంతియుతంగా పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నరేష్‌, దుర్గాప్రసాద్‌, వెంకటరమణ, కేశవ్‌ ప్రసాద్‌, గోవిందప్ప, అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement