పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను గడువులోపు పరిష్కరించాలని ఎస్పీ సతీష్ కుమార్ పోలీస్ అధికారులకు సూచించారు. సోమవారం పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ ప్రజా సమస్యల పరిష్కారి వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ అర్జీలను స్వీకరించారు. 70 వినతులు స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. సమస్యలు ఓపిగ్గా విని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ చేసి మాట్లాడారు. సమస్య తీవ్రతను తెలుసుకొని చట్టపరిధిలో విచారించి పరిష్కారం చూపుతామన్నారు. అర్జీలు పునారావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, సీఐ బొజ్జప్ప, లక్ష్మీకాంత్‌రెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ సతీష్‌కుమార్


