ఐదు నెలల జీతాలు వెంటనే చెల్లించండి | - | Sakshi
Sakshi News home page

ఐదు నెలల జీతాలు వెంటనే చెల్లించండి

Sep 1 2026 3:18 AM | Updated on Sep 1 2026 3:18 AM

ప్రశాంతి నిలయం: వెంటనే తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం రెవెన్యూ భవన్‌ ఎదుట సమ్మె చేపట్టారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు పాల్గొని కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ సత్యసాయి తాగునీటి పథకం ద్వారా జిల్లాలోని వందలాది గ్రామాల ప్రజలకు తాగునీరు అందుతోందన్నారు. కార్మికుల నిరంతర కృషితో ప్రజల దాహర్తి తీరుస్తున్నారని చెప్పారు. అయితే ప్రభుత్వం కార్మికులపై పూర్తి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ వారి కనీస హక్కు అయిన నెలసరి వేతనం కూడా సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. కార్మికులు విధిలేని పరిస్థితులలో 24 గంటల నిరవధిక సమ్మెకు పూనుకున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కార్మికులకు ఇవ్వాల్సిన 5 నెలలు వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల వేతనాలు, ఉద్యోగ భద్రత విషయంలో శాశ్వత పరిష్కారం చూపాలని, రిటైర్డ్‌ అయిన కార్మికులకు రావాల్సిన గ్రాట్యూటీని వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వారు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ముత్యాలు, సాకే వెంకటేషు, కేవీపీఎస్‌ రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement