దేవుని భూమిని కాపాడండి | - | Sakshi
Sakshi News home page

దేవుని భూమిని కాపాడండి

Aug 23 2026 2:16 AM | Updated on Aug 23 2026 2:16 AM

ధర్మవరం రూరల్‌: దేవుని భూమిని కబ్జా చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ మండల పరిధిలోని పోతుకుంట గ్రామస్తులు వాపోయారు. శనివారం తహసీల్దార్‌ దేవరాజ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ నులక రామయ్య, క్రిష్ణారెడ్డి, జయరామిరెడ్డి, పైటే సాయినాథ్‌, వెంకటేష్‌, ఎంపీటీసీ భర్త కొండా తదితరులు మాట్లాడుతూ ధర్మవరం పట్టణ సరిహద్దులో అతి పురాతన పోతులయ్య స్వామి గుడి ఉందన్నారు. సర్వే నంబర్‌ 582లో 92 సెంట్ల స్థలం ఆర్‌అండ్‌బీకి చెందినదని, ఈ స్థలానికి అనుకుని గుడికి చెందిన స్థలం ఉందన్నారు. ఇక్కడ జాతర, పన్నారపు బండ్లు, జ్యోతుల బోనాలు తదితర వాటిని నిర్వహించేవారన్నారు. ఉమ్మడి జిల్లాలోనే కాకుండా బెంగళూరు తదితర ప్రాంతాలలో అధిక సంఖ్యలో స్వామి కాపులు ఉన్నారని చెప్పారు. గుడి స్థలం ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో మార్కెట్‌లో రూ.కోట్లలో ధర పలుకుతోందన్నారు. కొందరు ఈ స్థలంపై కన్నేసి కబ్జా చేశారన్నారు. నకిలీ పట్టాలు చూపుతూ కంచె వేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఆర్‌అండ్‌బీ స్థలానికి రెవెన్యూ అధికారులు పట్టా ఎలా ఇస్తారంటూ మండిపడ్డారు. స్థలం కబ్జా చేయడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, జాతర సమయంలో స్వామి కార్యాలు చేసుకోవడానికి వీలు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వరకే పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎటువంటి స్పందన లేదన్నారు. ఇప్పటికై నా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సూర్యనారాయణరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, గవ్వల ప్రభాకర్‌, నారపరెడ్డి, రామక్రిష్ణారెడ్డి, మల్లికార్జున, ధనుంజయ, బోగే నరసింహారెడ్డి, హరి ప్రసాద్‌, వెంకటరెడ్డి, మహేష్‌, చెన్నప్ప, ఓబిరెడ్డి, ధనుంజయరెడ్డి, బాషా, డి.శ్రీనివాసులు, అంకన్న, వీరనారప్ప తదితరులు పాల్గొన్నారు.

కబ్జా స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్‌కు గ్రామస్తుల వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement