ధర్మవరం అర్బన్: పట్ట ణాన్ని స్వచ్ఛ ధర్మవరంగా మార్చేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. శనివారం స్థానిక కొత్తపేట మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పాఠశాల ఆవరణంలో ఉత్పత్తి అయిన తడి చెత్త నుంచి తయారైన ఎరువును మొక్కల కోసం వాడుకోవాలని సూచించారు. విద్యార్థులు భోజనానికి ముందు చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, ఎంఈఓ రాజేశ్వరిదేవి, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
● ధర్మవరం మార్కెట్ యార్డులోనున్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ శనివారం పరిశీలించారు. గోడౌన్ వద్ద నిరంతరం భద్రత ఉండాలన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు.
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్


