డీ.హీరేహాళ్ (బొమ్మనహాళ్): శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. డీ.హీరేహాళ్ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, కేసుల నమోదు ప్రక్రియ, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించాలన్నారు. సైబర్ మోసాలకు గురైన బాధితులకు న్యాయం జరిగేలా, వారు పోగొట్టుకున్న నగదును త్వరగా రిఫండ్ అయ్యేలా చూడాలన్నారు. అనంతరం నూతన పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
కణేకల్లు: రాయదుర్గం నియోజకవర్గంలో గాలిమరల ద్వారా సుజ్లాన్ కంపెనీ 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంటు ప్రారంభోత్సవానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ నెల 25న కణేకల్లు క్రాస్‌కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన బహిరంగ సభ స్థలాన్ని ఎస్పీ జగదీష్ , ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శుక్రవారం పరిశీలించారు. సభ, వాహనాల పార్కింగ్‌పై డీఎస్పీ రవిబాబు, సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ నాగమధులతో చర్చించారు.


