పామిడి: అమాయకురాలైన తనను నమ్మించి ఇంటి స్థలాన్ని రాయించుకోవడంతో పాటు బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టించి మోసం చేశాడంటూ స్థానిక గాయత్రీ కాలనీవాసి, నారాయణ భార్య చితంబరమ్మ పామిడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు... తనకు వరుసకు మనువడైన బీజీపీ నేత రాజశేఖర్‌గౌడ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన వద్దకు వచ్చి నిరక్ష్యరాసురాలినైన తనను నమ్మించి స్థానిక గాయత్రి కాలనీలో ఉన్న 3 సెంట్ల స్థలాన్ని తన పేర రిజిష్టర్ చేయించుకున్నాడన్నారు. అలాగే తనకు సంబంధించిన 8 తులాల బంగారును బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే తాను బీజేపీ నేతనంటూ బెదిరింపులకు పాల్పడటంతో పాటు దాడికి దిగుతున్నాడన్నారు. పోలీసులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
గుంతకల్లు రూరల్: స్థానిక నాయీబ్రాహ్మణ కాలనీలో నివాసం ఉంటున్న అస్లామ్ అనే వ్యక్తి ఇంట్లో గురువారం రాత్రి చొరబడిన దొంగలు తులం బంగారాన్ని అపహరించారు. బేల్దారి పనులు చేసుకుంటున్న అస్లామ్ తన భార్య పిల్లలతో కలిసి గురువారం రాత్రి గుత్తి దర్గాకు వెళ్లారు. తిరిగి శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఇంటి డోర్ పగులగొట్టి ఉండడాన్ని గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బ్యాగ్‌లో ఉంచిన తులం బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


