అనంతపురం: విజయనగరం వేదికగా ఈ నెల 22 నుంచి 31వ తేదీ వరకూ జరిగే ఏసీఏ సీనియర్ పురుషుల మల్టీడే క్రికెట్ రాష్ట్ర ప్రాబబుల్స్ జట్టుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు ఎంపికయ్యారు. ఇప్పటి వరకూ జరిగిన అంతర్ జిల్లా క్రికెట్ మ్యాచుల్లో వారి ప్రదర్శనల ఆధారంగా ఎంపిక జరిగినట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి టి.శ్రీధర్ తెలిపారు. ఎంపికై న వారిలో కదిరికి చెందిన పి.గిరినాథ్‌రెడ్డి (రంజీ ప్లేయర్), అనంతపురం రూరల్ పరిధిలోని కురుగుంట నివాసి బి.వినయ్‌కుమార్ (రంజీ ప్లేయర్), అనంతపురానికి చెందిన ఎం.కె.దత్తారెడ్డి (రంజీ ప్లేయర్ – వికెట్ కీపర్), రాప్తాడు నివాసి జి.మల్లికార్జున, అనంతపురానికి చెందిన ఎం.దీపక్ ఉన్నారు. ఎంపికై నారిని జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు.


