ఇసుక డంప్‌పై దాడులు | - | Sakshi
Sakshi News home page

ఇసుక డంప్‌పై దాడులు

Aug 19 2026 12:54 AM | Updated on Aug 19 2026 12:54 AM

300 టన్నుల ఇసుక స్వాధీనం

శింగనమల: ఉల్లికల్లు పెన్నానది పరివాహక ప్రాంతంలో అక్రమంగా తవ్వకాలు చేపట్టి.. డంప్‌ చేసిన ఇసుకపై మైనింగ్‌, రెవెన్యూ, పోలీసులు సంయుక్తంగా మంగళవారం దాడులు నిర్వహించారు. ‘శింగనమలలో ఇసుక దందా’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఉల్లికల్లు పెన్నానది పరిసర ప్రాంతాల్లో ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో జిల్లా మైనింగ్‌ అధికారి ప్రసాద్‌రెడ్డి, తహసీల్దార్‌ శేషారెడ్డి, శింగనమల సీఐ రాగిరి రామయ్య, ఎస్‌ఐ ప్రసాద్‌ సంయుక్తంగా దాడులు చేశారు. అయితే అప్పటికే అప్రమత్తమైన ఇసుకాసురులు తమ వాహనాలను అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించారు. పలు చోట్ల ఉన్న 300 టన్నుల ఇసుక డంప్‌లను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశారు. ఇసుక డంప్‌ల వద్ద వీఆర్‌ఏలను బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement