ఈ చిత్రం గాండ్లపెంట మండల పరిధిలోని కురుమామిడి పంచాయతీ పచ్చారుమేకల తండాలోని ప్రైమరీ పాఠశాల (ఫౌండేషన్ స్కూల్)లోనిది. ఈ పాఠశాలలో 1, 2 తరగతులు నిర్వహిస్తుండగా 2వ తరగతిలో లిఖిత అనే విద్యార్థి మాత్రమే ఉంది. దీంతో ఉపాధ్యాయురాలు చంద్రకళ చిన్నారికి పాఠాలు చెబుతోంది. ఒకరికి ఒకరు తోడుగా పాఠశాలకు వచ్చి వెళ్తున్నారు. వీరిద్దరిలో ఏ ఒక్కరు రాకపోయినా పాఠశాలకు సెలవే. గత ఏడాది కూడా ఈ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులే ఉండేవారని, ఈ ఏడాది ఒకరు మరో పాఠశాలకు వెళ్లడంతో లిఖిత మాత్రమే మిగిలిపోయింది. కాగా ఇదే మండలంలో ఇద్దరు విద్యార్థులున్న పాఠశాలలు రెండు ఉండగా, ముగ్గురు విద్యార్థులున్న పాఠశాల ఒకటి, నలుగురు విద్యార్థులున్న పాఠశాలలు ఐదు, 10 మంది విద్యార్థులున్న పాఠశాలలు 16 ఉన్నాయి. చంద్రబాబు సర్కార్ సర్కారు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో విద్యార్థులంతా ‘ప్రైవేటు’బాట పట్టగా...ప్రభుత్వ పాఠశాలలు ఇలా వెలవెలబోతున్నాయి.
– గాండ్లపెంట:


