బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయంలో 64.816 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. బుధవారం నాటికి 1,00,700 క్యూసెక్కుల ఉన్న ఇన్‌ఫ్లో గురువారం నాటికి 60,751 క్యూసెక్కులకు తగ్గింది. జలాశయశం ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి, చిక్కమగళూరు, వరనాడులో ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండడంతో డ్యాంకు వరద చేరుతోంది. ఈ క్రమంలో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రసుత్తం జలాశయంలో 1,633 అడుగుల మట్టానికి గాను 1621.22 అడుగులకు నీరు చేరింది. ఇన్‌ఫ్లో 60,751 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1499 క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 64.816 టీఎంసీల నీరు నిల్వ ఉంది.


