రేపు జిల్లా వ్యాప్తంగా ‘పరిష్కార వేదిక’ రద్దు | - | Sakshi
Sakshi News home page

రేపు జిల్లా వ్యాప్తంగా ‘పరిష్కార వేదిక’ రద్దు

Jul 12 2026 3:35 AM | Updated on Jul 12 2026 3:35 AM

ప్రశాంతి నిలయం: సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ఈనెల 13వ తేదీ (సోమవారం) రద్దు చేసినట్లు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమం కీలకదశలో ఉన్నందున పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. అయితే అర్జీలను meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు.

నవోదయకు

దరఖాస్తు చేసుకోండి

పుట్టపర్తి/లేపాక్షి: జవహర్‌ నవోదయ విద్యాలయలో (2027–28 విద్యా సంవత్సరానికి) 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ కిష్టప్ప, లేపాక్షి నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ నాగరాజు తెలిపారు. ఈ మేరకు వారు శనివారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. 2026–2027 విద్యా సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈ ఏడాది నవంబర్‌ 28వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు www.navodaya. gov.in వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు.

అర్హులందరికీ

ఓటు హక్కు కల్పించాలి

పుట్టపర్తి/పుట్టపర్తి టౌన్‌: ‘సర్‌’ సర్వేలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బీఎల్‌ఓలు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అధికారులు ఆదేశించారు. అలాగే ఓటర్లకు ఇచ్చిన ఎన్యుమరేషన్‌ ఫారాలు తిరిగి తీసుకుని సకాలంలో డిజిటలైజన్‌ చేయాలన్నారు. శనివారం ఆయన కొత్తచెరువు మండల కేంద్రంలోని 19, 21, 22, 27, 28 పోలింగ్‌ బూత్‌లు, పుట్టపర్తి పట్టణంలోని 6, 7 వార్డుల సచివాలయాల పరిధిలో సాగుతున్న ‘సర్‌’ సర్వేను తనిఖీ సిబ్బంది పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ... ‘సర్‌’లో అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూసుకోవాలన్నారు. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది విధిగా కార్యాలయాల్లో ఉంటూ ప్రజలకు సేవలందించాలన్నారు. సచివాలయ ఉద్యోగుల పనితీరుపై నిరంతరం నిఘా ఉంటుందని, విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు, ఆర్డీఓ సువర్ణ, సచివాల సిబ్బంది ఉన్నారు.

లోక్‌ అదాలత్‌లో 11,898

కేసులు పరిష్కారం

అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 11,898 కేసులకు న్యాయ పరిష్కారం లభించింది. అనంతపురంలో కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, ప్రధాన న్యాయమూర్తి భీమారావు మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ తీర్పునకు ఎలాంటి అప్పీల్‌ చేసే అధికారమూ ఉండబోదని స్పష్టం చేశారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్‌ మాట్లాడుతూ మోటారు వాహనాల ప్రమాదాలు, సివిల్‌ దావా, ప్రీలిటిగేషన్‌, ఎస్‌ఐ యాక్ట్‌ తదితర మొత్తం 11,898 కేసుల్లో రూ.14,93,13,511 మొత్తానికి పరిష్కారం దక్కింది.

సత్యసాయికి భక్తురాలు గాయని జానకి

ప్రశాంతి నిలయం: ప్రముఖ నేపథ్య గాయని ఎస్‌.జానకి సత్యసాయి భక్తురాలు. సత్యసాయి బాబా దర్శనార్థం తొలిసారి 1992లో ఆమె పుట్టపర్తికి విచ్చేశారు. ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియం సభా మంటపంలో జరిగిన ప్రత్యేక సంగీత విభావరిలో పాల్గొన్నారు. ‘నాగుండెలో నీవు నిలుచుండు బాబా – నీ గుండెలో నాకు చోటివ్వు బాబా’ అంటూ ఆమె పాడిన పాట అప్పట్లో భక్తులను అలరించింది. స్వామి ఆశీస్సులు పొందిన ధన్యజీవురాలు ఎస్‌.జానకి అంటూ భక్తులు అభినందించారు. శనివారం మైసూరులో గాయని జానకి కన్నుమూసిన విషయం తెలియగానే బాబా భక్తులు... ఆమె ప్రశాంతి నిలయంలో చేసిన కచేరీని గుర్తు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement