దళిత కాలనీలో.. దాహం కేకలు | - | Sakshi
Sakshi News home page

దళిత కాలనీలో.. దాహం కేకలు

Jul 12 2026 3:35 AM | Updated on Jul 12 2026 3:35 AM

గుడిబండ: వర్షాకాలంలోనూ మడకశిర నియోజకవర్గంలో తాగునీటి కోసం ఇబ్బందులు తప్పడం లేదు. ముందస్తు చర్యలు లేకపోవడం, పట్టించుకునేవారే కరువు కావడంతో ప్రతి మండలంలోనూ తాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా నిత్యం ఎక్కడోచోట మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నారు. తాజాగా గుడిబండ మండలం ఫళారం గ్రామంలోని పాత దళిత కాలనీకి చెందిన మహిళలు రోడ్డెక్కారు. తమ కాలనీకి నీటి సరఫరా నిలిచి పదిరోజులైనా పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ శనివారం ఖాళీ బిందెలతో గుడిబండ – రొళ్ల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ... తమ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, సంబంధిత శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా... పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి దళితుడైనా తమకీ దుస్థితి తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు తాగునీటి సమస్యను తీర్చాలని కోరారు.

తాగునీటి కోసం ఫళారంలో

రోడ్డెక్కిన మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement